HYD Traffic : కి.మీ ప్రయాణానికి అరగంటపైనే.. పండగపూట సిటీలో భారీగా ట్రాఫిక్ జామ్

by Prasad Jukanti |   (  Updated:2025-08-09 09:09:09  IST  )

పండగపూట సిటీలో ట్రాఫిక్ జామ్ ప్రయాణికులను అవస్థలకు గురి చేస్తోంది.

HYD Traffic : కి.మీ ప్రయాణానికి అరగంటపైనే.. పండగపూట సిటీలో భారీగా ట్రాఫిక్ జామ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో రాఖీ పండగ (Rakshabandhan) సందడి కొనసాగుతోంది. రాఖీ కట్టేందుకు పెద్ద ఎత్తున అక్కా చెల్లెళ్లు తమ సోదరులు ఉంటున్న ప్రాంతాలకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో భారీగా ట్రాపిక్ జామ్ (Hyderabad traffic) అయింది. ఉప్పల్, ఎల్బీనగర్, సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, లింగంపల్లి, ఎర్రగడ్డ ఏరియాలో ట్రాఫిక్ ఇబ్బందులతో వాహనదారులు పలు చోట్ల అర కిలోమీటర్ ప్రయాణానికి 40 నిమిషాల సమయం పడుతుండటంతో పండగ పూట అక్కాచెల్లెళ్లు అవస్థలు పడుతున్నారు. మరో పైపు ప్రయాణికులతో ఆర్టీసీ బస్టాండ్లు కిక్కిరిసిపోయాయి. జూబ్లీబస్టాండ్, జేపీఎస్ నుంచి మహిళలు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు భారీగా తరలివస్తున్నారు. ‘రాఖీ స్పెషల్‌’ పేరుతో తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేసింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు ఏర్పాటు చేశామని అధికారుుల చెబుతున్నాఅన్ని బస్సులు ఫుల్ అవుతుండటంతో చాలా మంది నిల్చునే ప్రయాణం చేస్తున్నారు. డీలక్స్‌, సూపర్‌ లగ్జరీ వంటి బస్సుల్లో ముందే రిజర్వేషన్లు పూర్తయ్యాయి. దీంతో నేరుగా బస్టాండ్లకు చేరుకున్న ప్రయాణికులు తీవ్ర నిరాశ పడుతున్నారు. అదనంగా మరికొన్ని బస్సులు నడపాలని కోరుతున్నారు.

Next Story