- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాఖీ పండుగ స్పెషల్: ప్రయాణికులకు శుభవార్త
రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. పలు బస్ స్టాండ్లలో రద్దీని గమనించి.. రాఖీ స్పెషల్ పేరుతో బస్సు సర్వీసులను అందిస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. పలు బస్ స్టాండ్లలో రద్దీని గమనించి.. రాఖీ స్పెషల్ పేరుతో బస్సు సర్వీసులను అందిస్తోంది. అంతేకాదు.. పలు రూట్లలో సర్వీసులను సైతం పెంచింది. రేపు(శనివారం) రాఖీ పండుగ ఉన్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని అన్ని బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ముఖ్యంగా సికింద్రాబాద్, జేబీఎస్, ఎంజీబీఎస్ రూట్లలో బస్సుల కోసం ప్రయాణికులకు పడిగాపులు గాస్తున్నారు. ఈ నేపథ్యంలో రాఖీ స్పెషల్ బస్సులు పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం. మరోవైపు గతేడాది రాఖీ పండుగ సందర్బంగా రికార్డు స్థాయిలో ఆర్టీసీకి లభాలు వచ్చాయి. దాదాపు 63 లక్షల మంది వరకు ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చినట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది. రాఖీ పండుగ రోజున రికార్డు స్థాయిలో రూ.32 కోట్ల వరకు ఆదాయం వచ్చిందన్నారు. అందులో మహాలక్ష్మి పథకం ద్వారా రూ.17 కోట్లు, నగదు చెల్లింపు టికెట్ల ద్వారా రూ. 15 కోట్ల వరకు వచ్చిందన్నారు. టీజీ ఆర్టీసీ చరిత్రలో ఇది ఆల్‌టైం రికార్డు అని సజ్జనార్ అన్నారు. ఈ సందర్భంగా సిబ్బంది, అధికారులను సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ అభినందించారు.






