మిస్టర్ ఇండియా 2025 టైటిల్ గెలిచిన రాకేష్ ఆర్నె

by Bhanu |

తెలంగాణకు చెందిన రాకేష్ ఆర్నె దేశ స్థాయిలో ప్రతిభను చాటుతూ మిస్టర్ ఇండియా 2025 టైటిల్‌ను గెలుచుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా నవపేట మండలం ధర్పల్లి గ్రామానికి చెందిన రాకేష్, మంగళవారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తన విజయం వెనకున్న ప్రయాణాన్ని పంచుకున్నారు.

మిస్టర్ ఇండియా 2025 టైటిల్ గెలిచిన రాకేష్ ఆర్నె
X

దిశ, హిమాయత్‌నగర్: తెలంగాణకు చెందిన రాకేష్ ఆర్నె దేశ స్థాయిలో ప్రతిభను చాటుతూ మిస్టర్ ఇండియా 2025 టైటిల్‌ను గెలుచుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా నవపేట మండలం ధర్పల్లి గ్రామానికి చెందిన రాకేష్, మంగళవారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తన విజయం వెనకున్న ప్రయాణాన్ని పంచుకున్నారు.

ఈ సందర్భంగా రాకేష్ మాట్లాడుతూ, “నా విజయానికి మూలం నిరంతర కృషి, పట్టుదల, కుటుంబం మరియు మిత్రుల సహకారం” అని అన్నారు. మిస్టర్ ఇండియా పోటీలకు తాను తన ఫిట్‌నెస్, ఆత్మవిశ్వాసం, సామాజిక అవగాహనతో సన్నద్ధం అయ్యానని వివరించారు.

ఇప్పుడు తన తదుపరి లక్ష్యం మిస్టర్ ఎలైట్ గ్లోబల్ పోటీల్లో భారత్‌ను ప్రతినిధ్యం వహించడం అని తెలిపారు. “ఫిట్‌నెస్ అనేది కేవలం శారీరక పరిమితులకే కాదు, మానసికంగా కూడ చాలా అవసరం. ఈ దిశగా యువతలో అవగాహన పెంచేందుకు త్వరలోనే శిక్షణా క్యాంపులు , ఫిట్‌నెస్ వర్క్‌షాపులు నిర్వహిస్తాను” అని చెప్పారు. తెలంగాణ నుంచి ప్రపంచ వేదికపై భారత జెండాను ఎగరవేయడమే తన దీర్ఘకాలిక లక్ష్యమని రాకేష్ ఆర్నె ఆత్మవిశ్వాసంగా పేర్కొన్నారు.

Next Story