ఢిల్లీకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. మరికాసేపట్లో రాజ్యసభ అభ్యర్థులపై క్లారిటీ

by Prasad Jukanti |

సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. రాజ్యసభ అభ్యర్థి ఎంపికపై ఏఐసీసీ పెద్దలతో చర్చించనున్నారు.

ఢిల్లీకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. మరికాసేపట్లో రాజ్యసభ అభ్యర్థులపై క్లారిటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఢిల్లీ (Delhi Tour) చేరుకున్నారు. ఇవాళ ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. మరికాసేపట్లో అక్కడ ఏఐసీసీ పెద్దలతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ రాజ్యసభ రెండో అభ్యర్థిపై చర్చించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఒక స్థానానికి పార్టీ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. రెండో స్థానానికి రాష్ట్ర నేతల నుంచి తీవ్రమైన డిమాండ్ ఉన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఎవరి పేరు సూచించబోతున్నారు? అధిష్టానం ఎవరి పేరు ఫైనల్ చేయబోతోంది అనేది తేలాల్సి ఉంది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో అధిష్టానం ఎవరిని ఖరారు చేయబోతోంది అనేది చూడాలి. హైకమాండ్ తో చర్చలు ముగిసిన అనంతరం ఇవాళ సాయంత్రం వరకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story