ఒక్కపైసా ఇవ్వడంలేదు.. ప్రధాని మోదీపై కేకే ఫైర్

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-04-10 15:55:27  IST  )

ప్రధాని మోదీపై రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు ఆగ్రహం వ్యక్తం చేశారు....

ఒక్కపైసా ఇవ్వడంలేదు.. ప్రధాని మోదీపై కేకే ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రధాని మోదీపై రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.. తెలంగాణ పర్యటనలో మోదీ చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వంపై మోదీ చేసిన ఆరోపణలు అసత్యాలు అని కొట్టిపారేశారు. తెలంగాణ అభివృద్ధికి ప్రధాని మోదీనే సహకరించడంలేదని ఆరోపించారు. విభజన హామీలను సైతం మర్చిపోయారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం ఒక్కపైసా ఇవ్వలేదని కేకే వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమారే బీఆర్ఎస్ గెలుపునకు బాటలని కే కేశవరావు తెలిపారు.

Also Read..

‘రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదు’

Next Story