డెలివరీ బాయ్‌తో ‘రాజు వెడ్స్ రాంబాయి’ హీరో గొడవ! వీడియో వైరల్

by Ramesh Naini |

‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో అఖిల్ రాజ్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు.

డెలివరీ బాయ్‌తో ‘రాజు వెడ్స్ రాంబాయి’ హీరో గొడవ! వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో అఖిల్ రాజ్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ఫుడ్ తప్పుగా తెచ్చాడనే నెపంతో ఆయన ఒక డెలివరీ బాయ్‌పై భౌతిక దాడికి దిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. పొరపాటున వేరే ఆర్డర్ ఇచ్చినందుకు సదరు డెలివరీ బాయ్ క్షమాపణలు చెప్పినప్పటికీ, హీరో అఖిల్ రాజ్‌ అమర్యాదగా ప్రవర్తించినట్లు వీడియో ద్వారా తెలుస్తోంది. ఆగ్రహంతో ఊగిపోతూ డెలివరీ బాయ్‌పైకి అఖిల్ దూసుకెళ్తుండగా.. అతని తండ్రి అడ్డుకునే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా, రికార్డ్ చేసిన వీడియోను డిలీట్ చేయాలంటూ అఖిల్ ఒత్తిడి తెచ్చినట్లు ఆ వీడియోలో స్పష్టంగా వినిపిస్తోంది. ఒక అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌లో జరిగిన ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, డెలివరీ బాయ్‌తో హీరో అఖిల్ రాజ్ గొడవకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

చిన్న సినిమాగా విడుదలై..

కాగా, గతేడాది నవంబర్ 21న చిన్న సినిమాగా విడుదలై, బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. సాయిలు కంపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా, ‘గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ – 2025’ లో ఉత్తమ చిత్రంగా అవార్డును కూడా కైవసం చేసుకుంది. ప్రస్తుతం అఖిల్ రాజ్, సతీష్ గోగాడ దర్శకత్వంలో ‘అర్జునుడి గీతోపదేశం’ అనే మరో చిత్రంలో నటిస్తున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో శరవేగంగా సాగుతోంది. ఈ క్రమంలో హీరో అఖిల్ రాజ్ ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం చర్చనీయాంశంగా మారింది.

Next Story