సిందూర్​తో దేశ సైనికుల సత్తా ప్రపంచం గుర్తించింది : రాజ్​నాథ్​సింగ్​

by Ajay Maddhiboyina |   (  Updated:2025-09-17 17:39:22  IST  )

నిజాం పాలనలో రజాకార్ల దుశ్చర్యలకు వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేసిన సెప్టెంబర్ 17వ తేదీ ఒక గుర్తుగా నిలుస్తుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​సింగ్​ పేర్కొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ సమర్థ నాయకత్వంతో హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైందన్నారు.

సిందూర్​తో దేశ సైనికుల సత్తా ప్రపంచం గుర్తించింది : రాజ్​నాథ్​సింగ్​
X

దిశ, తెలంగాణ బ్యూరో : నిజాం పాలనలో రజాకార్ల దుశ్చర్యలకు వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేసిన సెప్టెంబర్ 17వ తేదీ ఒక గుర్తుగా నిలుస్తుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​సింగ్​ పేర్కొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ సమర్థ నాయకత్వంతో హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైందన్నారు. నిజాం పాలనలో రజాకార్లు పాల్పడిన అకృత్యాలు అసంఖ్యాకమని, వారి ఆగడాలతో విసిగిపోయిన ప్రజలు తిరుగుబాటు చేశారన్నారు. బుధవారం సికింద్రాబాద్‌లోని పరేడ్ మైదానంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. సైనిక అమరవీరుల స్తూపానికి, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి నివాళులర్పించి జాతీయ జెండాను ఆవిష్కరించి, త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పోలో దేశ చరిత్రలో ఒక గొప్ప అధ్యాయమని, ఆనాడు నిజాం రాజు ఓటమిని అంగీకరించి సర్దార్ పటేల్ ముందు తలవంచారని గుర్తు చేశారు. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో అనేక రాజ్యాలు ఉండటంతో దేశ సమైక్యతకు ఆటంకం ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. అఖండ భారత్ నినాదంతో సర్దార్ పటేల్ ముందుకు సాగి సంస్థానాలను విలీనం చేశారని కొనియాడారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ధర్మ మార్గంలో నడుస్తామని, జాతీయ సమగ్రతను దెబ్బతీసే కుట్రలను సులువుగా ఎదుర్కొంటామన్నారు. పటేల్​ఆశించిన దేశాన్ని నిర్మించేందుకు ప్రధాని మోడీ ఎంతో కృషి చేస్తున్నారని, ప్రపంచంలో భారత్​ను అగ్రస్దానం నిలబెట్టేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఆర్టికల్​370 రద్దు చేసి జమ్ముకాశ్మీర్​ను అభివృద్ది చేస్తున్నామని, మనమధ్య అంతర్గత విబేధాలు ఉంటే దేశంలో విషయంలో అందరు ఏకం కావాలని సూచించారు. దేశ రక్షణ, భద్రత విషయంలో ప్రజలంతా ఏకతాటిపై వస్తామని, ప్రస్తుతం భారత్​సాదాసీదా దేశం కాదని, ప్రపంచాన్ని శాసించే స్దాయికి ఎదిగిందన్నారు. ఆపరేషన్​సిందూర్ భారత్​సైనికులు తమ సత్తా చాటి పాక్​వణికించారని, ఉగ్రవాది మసూర్​కుటుంబ సభ్యులను అంతం చేశామన్నారు. పహల్గాంలో మతం పేరు అడిగి చంపిని వారికి తగిన బుద్ది చెప్పి మరోసారి దాడి చేయకుండా చేశామన్నారు. ఆపరేషన్​సిందూర్​జరిగిన తరువాత భారత్​బలం, సైనికుల సత్తా ప్రపంచమంతా చూసిందన్నారు. ఉగ్రవాదుల స్ధావరాల్లో వెళ్లికి మరి వారి హతమార్చామని, ఆపరేషన్ సిందూర్​ఇక ముగియలేదని ఇంకా కొనసాగుతుందన్నారు.

ఆపరేషన్​పోలోతోనే హైదరాబాద్​ప్రజలు స్వేచ్చ : కేంద్ర గజేంద్ర సింగ్​షెకావత్​

ప్రధాని మోడీ ఆదేశాలతో నేడు తెలంగాణ విమోచన దినోత్సవం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ విముక్తి కోసం పోరాడిన మహానీయులను కేంద్రం గుర్తిస్తుందని వారిని కీర్తి మరువలేకుండా చేస్తుందన్నారు. నిజాం నిరంకుశ పాలనను అంతం చేసేందుకు ఎంతో మంది ప్రాణాలు అర్పించారని, వారి త్యాగంతో ప్రజలంతా సుఖంగా ఉన్నారని పేర్కొన్నారు. ఆపరేషన్​పోలో చేసి సర్దార్​పటేల్​హైదరాబాద్​ప్రజలకు స్వాతంత్ర్య అందించారని తెలిపారు. సర్దార్ వల్లభాయి పటేల్‌ లేకుంటే తెలంగాణ పరిస్థితి ఊహించుకుంటే దారుణంగా ఉందన్నారు. మరో పాకిస్తాన్, మరో శ్రీలంకగా మారి ఆర్దిక సమస్యలతో అల్లాడి పోయేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి విషయాలను ముందుగానే పసిగట్టిన పటేల్ తెలంగాణకు స్వాతంత్య్రం రాకుండా స్వతంత్య్ర రాజ్యంగా ఉంటే భారతమాత కడుపులో కేన్సర్‌ ఉన్నట్లేనని ప్రకటించి నిజాం కుట్రలను భగ్నం చేసి తెలంగాణకు విముక్తి కల్పించారని పేర్కొన్నారు.

తెలంగాణ చరిత్రను కనుమరుగు చేసేలా రాష్ట్ర పాలకులు కుట్ర : కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి

రాష్ట్రంలో సెప్టెంబర్​17 గురించి గతంలో కాంగ్రెస్ , బీఆర్ఎస్ పార్టీ లు ఈ తరానికి, నవతరానికి తెలియకుండా దుర్మార్గంగా తొక్కిపెట్టారని ఆరోపించారు. పాఠ్యాంశాల్లో లేకపోవడం, విద్యార్థులకు కళాశాలలో చెప్పకపోవడం, బయట చెప్పకపోవడం, ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు, మూడు రంగుల జెండా ఎగిరిన రోజును ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా ఈ పార్టీలు అణిచివేస్తూ, చరిత్రను దాచిపెడుతున్నాయో తెలంగాణ ప్రజలందరూ ఆలోచించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఉన్న హైదరాబాద్ సంస్థానంలోని కొన్ని జిల్లాలు కర్ణాటకలో కలిశాయి. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా హైదరాబాద్ ముక్తి దివస్ పేరుతో అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. కొన్ని జిల్లాలు మహారాష్ట్రలో కలిసాయి. ఈ ప్రాంతంలోని జిల్లా గల తెలంగాణ ప్రాంతానికి చెందిన జిల్లాలు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు హైదరాబాద్ ముక్తి దివస్ పేరుతో మహారాష్ట్రలో నిర్వహిస్తున్నాయి. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఏం రోగం వచ్చిందని హైదరాబాద్ ముక్తి దివస్ ను ఎందుకు అధికారికంగా నిర్వహించలేదని నిలదీశారు. ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గతంలో, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, హైదరాబాద్ ముక్తి దివస్ ను అధికారికంగా నిర్వహించడం లేదని మండిపడ్డారు. ఇంకా ఎందుకు హైదరాబాద్ ముక్తి దివస్ పేరుకు పేర్లు మార్చి ప్రస్తుతం ఈ రాజకీయ పార్టీలు, ఈ ప్రభుత్వాలు తెలంగాణ ప్రజల పోరాటాన్ని, స్వాతంత్రం కోసం సమర్పించిన అనేక అమరవీరుల త్యాగాలను, ఫలితాలను, ఆకాంక్షలను అవమానం చేస్తున్నారు. అందుకే బీజేపీ నాయకత్వంలోని బిజెపీ ప్రభుత్వం, ప్రధాని మోడీ నేతృత్వంలో, గత మూడు సంవత్సరాల క్రితం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేయకపోయినా, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం ఎలా నిర్వహించబడుతున్నదో తెలంగాణ రాష్ట్రంలో కూడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించమని మోడీ ఆదేశించారని వెల్లడించారు. ఎంఐఎం పార్టీకి భయపడి కొన్ని సంవత్సరాలుగా ఈ చరిత్రను, త్యాగాలను, బలిదానాలను, వాస్తవాలను కొన్ని పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వం తొక్కిపెడుతున్నాయి. మజ్లిస్ పార్టీ కనిపిస్తే వంగి వంగి సలాం కొట్టే ఈ రాజకీయ పార్టీలకు రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలు తప్పకుండా బుద్ధి చెబుతారు. వచ్చే మూడు సంవత్సరాల తర్వాత, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో, గ్రామ గ్రామాన, అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్ద పండుగగా, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ గడ్డ మీద హైదరాబాద్ లిబరేషన్ డే, హైదరాబాద్ విముక్తి ఉత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు.

విమోచనం కోసం మొదటిసారి గొంతు ఎత్తిన పార్టీ బిజెపియే : కేంద్ర మంత్రి బండి సంజయ్​

భారత్ లో తెలంగాణ విలీనం కాకుండా మన పరిస్థితి ఎట్లుండేదో ఒక్క క్షణం ఆలోచించాలని, మరో పాకిస్తాన్, మరో శ్రీలంక, మరో బంగ్లాదేశ్ లా మారి ఆకలి కేకలతో కల్లోల దేశంగా తెలంగాణ మారేదని ఆందోళన వ్యక్తం చేశారు. సర్దార్ వల్లభాయి పటేల్‌ లేకపోతే తెలంగాణకు విముక్తి కలిగేది కాదని చెప్పారు. ఇంతటి చరిత్ర కలిగినందునే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. భారత ప్రభుత్వం గెజిట్ ప్రకటించినందున జనవరి 26, పంద్రాగస్టు మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ విమోచన ఉత్సవాలు’ పేరుతో అధికారికంగా నిర్వహంచాలని కోరారు. తెలంగాణ ప్రజా పాలన పేరుతో ఉత్సవాలు నిర్వహించడం సరికాదని, దానికంటే తెలంగాణ ప్రజా వంచక పాలన దినోత్సవం పేరుతో కార్యక్రమాలు నిర్వహించుకుంటే మంచిదని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం జరిగే సమయంలో ఆ పోరాటాలను గుర్తించి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుని పార్లమెంట్ బిల్లుకు ఆమోదం తెలపడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. దేశంలో మోడీ పాలనా ఫలితంగానే నేడు దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచలోనే 4వ స్థానానికి చేరింది, ప్రపంచమంతా నేడు భారతదేశం సాధిస్తున్న ప్రగతిని ప్రశంసిస్తుందంటే అందుకు కారకులైన మోదీ. తెలంగాణపై ప్రత్యేక ద్రుష్టి ఉన్నందునే గత 11 ఏళ్లలో 12 లక్షల కోట్లకుపైగా కేంద్రం నిధులను ఖర్చు చేసింది. తెలంగాణ ప్రజల కష్టాలను, బాధలను అర్ధం చేసుకుని అడుగడుగునా అండగా నిలుస్తూ పెద్ద దిక్కుగా నిలుస్తున్న ప్రధాని మోడీకి మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్ , కల్చర్ సెక్రటరీ వివేక్ అగర్వాల్ , సీఆర్పీఎఫ్ డీజీ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ , హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ , ఇతర పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, సిఆర్పిఎఫ్, సిఎస్ఎఫ్ అధికారులు, పోలీస్ అధికారులు, కళాకారులు, విద్యార్థులు, యువకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్దఎత్తున హాజరయ్యారు.

Next Story