రాజధాని బస్సుకు తప్పిన ప్రమాదం

by Disha Web Desk 4 |
రాజధాని బస్సుకు తప్పిన ప్రమాదం
X

దిశ, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళ్తున్న రాజధాని టిఎస్ జీరో నైన్ జెడ్ 7631లో ఒక్కసారిగా పొగలు రావడం కలకలం రేపింది. ఇంజన్ హీట్ అయి వస్తున్నాయా లేదా సాంకేతిక కారణామా అనేది తెలియాల్సి ఉంది. డ్రైవర్ అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. బస్సులో ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రయాణీకలు ఆందోళనకు గురయ్యారు. ప్రయాణికులు బస్సులో పొగలు వస్తున్న విషయాన్ని డ్రైవర్‌కు తెలియ జేయడంతో బస్సును శామీర్‌పేట ఔటర్ రింగు రోడ్ వద్ద నిలిపి వేశారు. ఈ క్రమంలో బస్సులోని ప్రయాణికులను మరో బస్సులో పంపించారు.



Next Story