- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘రజాకర్’ మూవీపై రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. వాళ్లకు కీలక పిలుపు (వీడియో)
సోషల్ మీడియాలో ‘రజాకర్’ మూవీ హాట్ టాపిక్‌గా మారింది.

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియాలో ‘రజాకర్’ మూవీ హాట్ టాపిక్‌గా మారింది. ఈ మూవీ టీజర్ సెగ ఆయా పార్టీలను సైతం తాకింది. సినిమా టీజర్ పై మంత్రి కేటీఆర్ తాజాగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక సినిమా టీజర్ లాంచ్ వేడుకలో పాల్గొన్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మూవీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మన స్వాతంత్ర పోరాటం జరిగిన తీరును ఇప్పటి యువకులకు ఈ సినిమా ద్వారా చూయించే ప్రయత్నం చేశారన్నారు. స్వాతంత్రం కోసం హైదరాబాద్‌లో జరిగిన పోరాటాన్ని, హిందూవులను టార్గెట్ చేస్తూ సాగిన రజాకర్ల పాలనను ఈ సినిమాలో తెరకెక్కించారన్నారు. ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా అవగాహన కల్పించాలని, సినిమాను సక్సెస్ చేసేందుకు ముందుకు రావాలని కోరారు. ‘కశ్మీర్ ఫైల్స్’, ‘కేరళ స్టోరీ’ సినిమాలను ఆపేందుకు చాలా మంది ప్రయత్నించారన్నారు. కశ్మీర్, కేరళలో జరిగిన వాస్తవాలను ఈ రెండు సినిమాలు ప్రజలకు తెలిపాయన్నారు.
Read More..
- Tags
- Razakar movie






