కిషన్ రెడ్డి జీ.. జూబ్లీహిల్స్ లో ఎన్ని ఓట్లతో ఓడిపోబోతున్నారు? రాజాసింగ్ హాట్ కామెట్స్

by Prasad Jukanti |   (  Updated:2025-10-14 07:47:37  IST  )

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని రాజాసింగ్ టార్గెట్ చేశారు.

కిషన్ రెడ్డి జీ.. జూబ్లీహిల్స్ లో ఎన్ని ఓట్లతో ఓడిపోబోతున్నారు? రాజాసింగ్ హాట్ కామెట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Rajasingh) కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేశారు. తాజాగా ఆయన కిషన్ రెడ్డిపై హాట్ కామెంట్స్ చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కిషన్ రెడ్డి బీఆర్ఎస్‍ను గెలిపిస్తారా లేక కాంగ్రెస్‍ను గెలిపిస్తారా? ఇక్కడ ఎన్ని ఓట్లతో ఓడిపోబోతున్నారు? తెలంగాణ, జూబ్లీహిల్స్ ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఓవైసీ, మీకు మధ్య కుదిరిన ఒప్పందం వల్లే ఎంఐఎం అభ్యర్థిని నిలపడం లేదా అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుందని ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ భారీ ఓట్ల తేడాతో ఓడిపోతే కేంద్ర అధికారుల వద్ద ముఖం ఎలా చూపుతారో ఆలోచన చేశారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు డివిజన్‍లలో వేలుపెట్టే అలవాటు కిషన్ రెడ్డికి (Kishan Reddy) ఉందని, నా జిల్లాలో అదేరకంగా జోక్యం చేసుకుని సర్వనాశం చేసి నన్ను పార్టీ నుంచి బయటకు పంపించారని ధ్వజమెత్తారు. మీరు కూడా ఏదో ఒకరోజు బయటకు వెల్లడం ఖాయం అని విమర్శించారు. కాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills by poll) కోసం బీజేపీ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. ఎవరిని బరిలోకి దింపబోతోందనేది ఇంకా ఉత్కంఠగానే ఉంది. ఈ క్రమంలో బీజేపీ బహిష్కృత నేత, సీనియర్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.

Read More: జూబ్లీహిల్స్‌ బై పోల్ బిగ్ అప్‌డేట్.. BRS అభ్యర్థి మాగంటి సునీతపై కేసు నమోదు

జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి ఎవరు ..? పార్టీ ఆదేశిస్తే నేను సిద్ధమే అంటున్న విక్రమ్ గౌడ్

Next Story