- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాధవీలతపై రాజాసింగ్ సంచలన కామెంట్స్
బీజేపీ నేత మాధవీలతపై ఆ పార్టీకి సస్పెండ్ చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలోని ఒక మహిళా శక్తి బృందంతో తనపై కామెంట్లు చేయిస్తున్నారని అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ నేత మాధవీలతపై ఆ పార్టీకి సస్పెండ్ చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలోని ఒక మహిళా శక్తి బృందంతో తనపై కామెంట్లు చేయిస్తున్నారని అన్నారు. తిరిగి వాళ్లపై విమర్శలు చేసే అంత చిన్నస్థాయి తనది కాదని కౌంటర్ వేశారు. దమ్ముంటే ఫేస్ టూ ఫేస్ చెప్పాలని, అంతే కానీ ప్రచారాలు చేయడం తగదని అన్నారు. నా వల్ల మీకు ఎలాంటి భయం ఉండదని కంగారు పడవద్దని వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాజాసింగ్ పై మాధవీలత షాకింగ్ కామెంట్స్ చేశారు. బీజేపీ మద్దతు లేకుండానే రాజాసింగ్ ఎమ్మెల్యేగా గెలిచారా అని ప్రశ్నించారు. కార్పోరేటర్ గా ఉన్న రాజాసింగ్ ను బీజేపీనే ఎమ్మెల్యేను చేసిందన్నారు. బీజేపీ గురించి ఏది పడితే అది మాట్లాడటం సరికాదని, ఇతర మతాల వారిని మహిళలను దూషించడమే హిందుత్వమా? అని ప్రశ్నించారు.






