బీజేపీని వాళ్లే నాశనం చేస్తున్నారు.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

by Ajay Maddhiboyina |

ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాగా రాజీనామా తరవాత మరోసారి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కిషన్ రెడ్డి చేతుల మీదుగా పార్టీలో జాయిన్

బీజేపీని వాళ్లే నాశనం చేస్తున్నారు.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ‌, వెబ్ డెస్క్: ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాగా రాజీనామా తరవాత మరోసారి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కిషన్ రెడ్డి చేతుల మీదుగా పార్టీలో జాయిన్ అయ్యానని ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే రాజీనామా లేఖను అందజేశానని చెప్పారు. పార్టీలో ఎప్పటివరకు మోనోపోలి ఉంటుందో అప్పటివరకు పార్టీ అధికారంలోకి రాదని చెప్పారు. పార్టీ కోసం కష్టపడుతూ అది నాశనం అవ్వడం తాము చూడలేమని చెప్పారు. అందుకే తాను పార్టీకి రాజీనామా చేశానని అన్నారు.

కొందరు బడా నాయకులు బీజేపీని నాశనం చేస్తున్నారని అన్నారు. అణచివేతను భరించే శక్తి ఇక తనకు లేదని స్పష్టం చేశారు. ఎవరైనా కొంతకాలం పాటు అణచివేతను భరించగలరని కానీ నిరంతం అణచివేతను భరించలేరని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే బయటకు వచ్చానని అన్నారు. పార్టీకి రాజీనామా చేసినా తాను హిందువు అని ధర్మప్రచారం చేయడం తన ధర్మం అని అది చేస్తూనే ఉంటానని చెప్పారు. ఇది తన వ్యక్తిగత నిర్ణయం అని అన్నారు. బీజేపీ అధ్యక్షుడిని ఎన్నుకునే ముందు కార్యకర్తలు, పార్టీ అభిమానులు నాయకుల అభిప్రాయాలు తీసుకోవాల్సిందని అన్నారు.

Next Story