- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముస్లీం సోదరులు ఆలోచించాలి.. వక్ఫ్ బోర్డు చట్టంపై రాజాసింగ్ వీడియో
అసదుద్దీన్ ఒవైసీకి రాజాసింగ్ సవాల్ విసిరారు. దమ్ముంటే వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా పెట్టిన బహిరంగ సభలో నిజం చెప్పే ప్రయత్నం చేయాలని అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: అసదుద్దీన్ ఒవైసీకి రాజాసింగ్ సవాల్ విసిరారు. దమ్ముంటే వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా పెట్టిన బహిరంగ సభలో నిజం చెప్పే ప్రయత్నం చేయాలని అన్నారు. వక్ఫ్ బోర్డు భూములను అమ్ముకుంది, కబ్జా చేసింది ఒవైసీ బ్రదర్స్ అన్నారు. భూములను లీజుకు వచ్చింది కూడా ఓవైసీ బ్రదర్సే అని విమర్శించారు. అప్పుడు దేవుడి భూములు అని గుర్తుకు రాలేదా అని మండిపడ్డారు. కేంద్రం ఆ భూములను కాపాడేందుకే మంచి చట్టాన్ని తీసుకువచ్చింది అని చెప్పారు. వక్ఫ్ బోర్డుకు 9 లక్షల 50 వేల ఎకరాల భూములు ఉన్నాయని వాటిపై వచ్చే ఆదాయం ఏమవుతోందని ప్రశ్నించారు.
భూముల్లో వ్యవసాయ భూములతో పాటూ షాపింగ్ కాంప్లెక్స్‌లు ఉన్న భూములు సైతం ఉన్నాయని తెలిపారు. ఆ భూములను ఎవరికీ అమ్ముకునేందుకు వీలు లేకుండా, తక్కవ ధరకు లీజుకు ఇవ్వకుండా ఉండేందుకు ఈ చట్టం తీసుకువచ్చారని అన్నారు. కానీ ఈ నిజాన్ని చెప్పే దమ్ము ఓవైసీకి లేదన్నారు. వక్ఫ్ బోర్డు బిల్లుపై వ్యతిరేకంగా మాట్లాడటమే ఓవైసీ ఆలోచన అని చెప్పారు. ముస్లీం సమాజం మేలుకోవాలని ఓవైసీని నమ్మవద్దని అన్నారు.
లేదంటే మీరే నష్టపోతారని వ్యాఖ్యానించారు. ఓవైసీ వక్ఫ్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా దారుసలేంలో బహిరంగ సభ పెట్టి జనాలను రెచ్చగొటాలని ప్రయత్నించారని విమర్శించారు. రోడ్లపై ఎన్ని నిరసనలు చేసినా ఒకసారి అమలు చేసిన చట్టం మారదని స్పష్టం చేశారు. కేంద్రం ఎవరికీ భయపడదన్నారు. వక్ఫ్ బోర్డు బిల్లులో చేయాల్సిన మార్పుల గుర్తించి ఓవైసీ చర్చించాలని కానీ అలా చేయకుండా ఆయన ఫేమస్ అవ్వడానికే బిల్లును చింపేశారని అన్నారు. ముస్లీం సోదరులు ఇది గమనించాలని రాజాసింగ్ సూచించారు.






