- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రాణం పోయిన ఆ పార్టీలో చేరను: ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీ మారుతున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీ మారుతున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. తాను ఏ పార్టీలో చేరడం లేదని.. బీజేపీ నుంచే పోటీలో ఉంటానని స్పష్టం చేశారు. అలాగే తన ప్రాణం పోయిన సెక్యులర్ పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలో ఎప్పటికీ చేరనని క్లారిటీ ఇచ్చారు. అలాగే బీజేపీ అధిష్ఠానం తనపై విధించిన సస్పెన్షన్‌ను సరైన సమయంలో ఎత్తివేస్తుందని తెలిపారు. ఒక వేల అలా జరగకుంటే రాజకీయాలకు దూరంగా ఉంటానని, అంతేకానీ స్వతంత్ర అభ్యర్థిగా కూడా పోటీ చేయనని తెలిపారు. తెలంగాణ హిందూ రాష్ట్రం అయ్యేందుకు పని చేస్తానని కీలక వ్యాఖ్యలు చేశారు. గోషామహల్ బీఆర్ఎస్ టికెట్ మజ్లిస్ చేతిలో ఉందని.. వారి నిర్ణయం కోసం బీఆర్ఎస్ టికెట్ పెండింగ్ పెట్టారని ఆరోపించారు.
Next Story






