- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MLA Rajasingh : కిషన్ రెడ్డి గారూ.. మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి : రాజాసింగ్
by Muthe.Rajitha |
కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) తమకు అపాయింట్మెంట్ ఇవ్వాలని గోషామహాల్ ఎమ్మెల్యే రాజసింగ్(MLA Rajasingh) విజ్ఞప్తి చేశారు.

X
దిశ, వెబ్ డెస్క్ : కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) తమకు అపాయింట్మెంట్ ఇవ్వాలని గోషామహాల్ ఎమ్మెల్యే రాజసింగ్(MLA Rajasingh) విజ్ఞప్తి చేశారు. తాను కిషన్ రెడ్డిని వ్యక్తిగతంగా కలిసి సమస్యలు చెప్పాలని అనుకుంటున్నానని, అందుకని తమకు సమయం కేటాయించాలని కోరారు. ఎప్పుడు, ఎక్కడికి వచ్చి కలవమని చెప్పినా తాను వచ్చి కలుస్తానని అన్నారు. రాష్ట్రానికి, దేశానికి బీజేపీ అవసరమని.. ఈ సమయంలో వ్యక్తిగత విషయాలు పక్కన బెట్టి పార్టీలో అంతా ఐక్యంగా కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. కాగా గత కొంతకాలంగా రాష్ట్ర అధినాయకత్వాన్ని, నేతలను టార్గెట్ చేస్తూ రాజసింగ్ పలు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సడన్ గా ఇలా యూ టర్న్ తీసుకొని.. కిషన్ రెడ్డిని కలవాలని మీడియా ముఖంగా కోరడం గమనార్హం.
Next Story






