రాజన్న ఆలయంలో 14 కోడెలు మృతి.. స్పందించిన కలెక్టర్

by Naga Rani Yarlagadda |

వేములవాడ రాజన్న ఆలయం (Vemulawada Rajanna Temple) ప్రాంగణంలో ఉన్న గోశాలలో వరుసగా కోడెలు మరణిస్తున్న విషయం కలవరపాటుకు గురిచేస్తోంది.

రాజన్న ఆలయంలో 14 కోడెలు మృతి.. స్పందించిన కలెక్టర్
X

దిశ, వెబ్‌డెస్క్: వేములవాడ రాజన్న ఆలయం (Vemulawada Rajanna Temple) ప్రాంగణంలో ఉన్న గోశాలలో వరుసగా కోడెలు మరణిస్తున్న విషయం కలవరపాటుకు గురిచేస్తోంది. గోశాలలో పరిమితికి మించి కోడెలను ఉంచడంతో వారంరోజుల వ్యవధిలో 14 కోడెలు మరణించాయి. అనారోగ్యంతో ఈ స్థాయిలో కోడెలు మృతి చెందడంతో.. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సిరిసిల్ల వెటర్నరీ వైద్య బృందాన్ని వేములవాడ గోశాలకు వెళ్లాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో గోశాలకు వెళ్లిన అంజిరెడ్డి వైద్య బృందం.. కోడెలను పరీక్షించారు.

డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం, రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోశాల అంతా బురదమయంకావడంతో కోడెల మధ్య తొక్కిసలాట జరిగి మరణించినట్లు ప్రాథమికంగా నిర్థారించారు. పరిస్థితిని పూర్తిగా సమీక్షించి.. కలెక్టర్ కు నివేదిక ఇస్తామన్నారు.

Next Story