MLA Raja Singh : కాంగ్రెస్ ప్రభుత్వంపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

by Muthe.Rajitha |

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Raja Singh) కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.

MLA Raja Singh : కాంగ్రెస్ ప్రభుత్వంపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్ : గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Raja Singh) కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లంచాలు పెరిగాయని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజలను రక్షించాల్సిన పోలీసులే లంచం(Bribe) తీసుకుంటూ ఏసీబీ(ACB)కి చిక్కుతున్నారని మండిపడ్డారు. పోలీస్ అధికారుల ఛాంబర్లలో సీసీ కెమెరాలు పెట్టడమే కాకుండా, లంచం తీసుకుంటూ పట్టుబడితే ఉద్యోగం నుంచి తొగించాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు ఎన్నో బయటికి వస్తున్నా ప్రభుత్వానికి గాని, సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) గాని చీమ కుట్టినట్టు కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఎన్నో హామీలు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ అవినీతి రహిత పాలనను అందిస్తామని మాత్రం హామీ ఇవ్వలేక పోతోందని ఎద్దేవా చేశారు.

Next Story