- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ మరో బంగ్లాదేశ్ కావడం ఖాయం: రాజాసింగ్ హాట్ కామెంట్స్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(Raja Singh) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఎంఐఎం నేతలైన అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఓవైసీలకు సీఎం రేవంత్ రెడ్డి దాసోహం అంటున్నారని విమర్శించారు. ఎంఐఎంకు కాంగ్రెస్ పూర్తిగా సరెండర్ అయ్యారని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎంఐఎంకు ఓటు వేస్తే తెలంగాణ మరో బంగ్లాదేశ్ కావడం ఖాయమని కీలక వ్యాఖ్యలు చేశారు.
CM రేవంత్ రెడ్డి కౌంటర్
అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి బీజేపీపై తీవ్రమైన కామెంట్స్ చేశారు. మోడీ ప్రభుత్వం వలన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని అన్నారు. తెలంగాణ కేంద్రానికి రూపాయి చెల్లిస్తే, అక్కడి నుంచి 42 పైసలు మాత్రమే వస్తున్నాయి.. దక్షిణాది రాష్ట్రాలను కేంద్రం నిర్లక్ష్యం చేస్తోంది.. యూపీ రూపాయి చెల్లిస్తే, కేంద్రం ఆ రాష్ట్రానికి 2 రూపాయాలు తిరిగి ఇస్తుంది.. బిహార్ రూపాయి చెల్లిస్తే, అక్కడ ఆరు రూపాయాలు తిరిగి ఇస్తున్నారు.. ఉత్తరాది రాష్ట్రాలకు అత్యధిక నిధులు ఇస్తున్నారు.. ఈ వివక్షపై ఎప్పుడైనా కిషన్‌రెడ్డి, బండి సంజయ్ మాట్లాడారా?.. 8 మంది ఎంపీలు గెలిస్తే.. మీరు రాష్ట్రానికి చేసిందేంటి అని ప్రశ్నించారు. మోడీని చూసి ఓటు వేయాలని కిషన్ రెడ్డి చెబుతున్నారని... గల్లీ ఎన్నికలకు మోడీతో ఏం సంబంధమని రేవంత్ ప్రశ్నించారు.
అసలు ఎంఐఎం లేకపోతే బీజేపీ కూడా లేదని అన్నారు. బీజేపీ నేతలు రాముడి పేరు చెప్పి ఎన్నిసార్లు ఓట్లు అడుగుతారో.. అసదుద్దీన్‌ను బూచీగా చూపించి అనేసార్లు ఓట్లు అడిగారని గుర్తుచేశారు. మత రాజకీయాలతో బీజేపీ పబ్బం గడుపుకుంటోందని విమర్శించారు. మొత్తం బీజేపీ నేతలకు అసదుద్దీన్ ఓవైసీ దేవుడు అని అన్నారు.






