- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఇద్దరం స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేద్దాం’.. కిషన్ రెడ్డికి రాజాసింగ్ సంచలన సవాల్
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(Raja Singh) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(Raja Singh) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ అధిష్టానం(BJP High Command) నుంచి పిలుపు వస్తే వెళ్లి కలుస్తానని ప్రకటన చేశారు. వాళ్లకు వాళ్లుగా పిలిస్తే వెళ్లి మళ్లీ పార్టీలో చేరుతా.. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని స్పష్టం చేశారు. తాను ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోను అని అన్నారు. రాజీనామా చేయకపోతే ఏం చేస్తారని అడిగారు. ఎంపీకి, కేంద్రమంత్రి పదవికి కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే.. తానూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. ఒకచోట ఇద్దరం స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేద్దాం.. ఎవరు గెలుస్తారో చూద్దామని సంచలన సవాల్ విసిరారు.
ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు(Ramchander Rao) రబ్బర్ స్టాంపుగా మారరని విమర్శించారు. బీజేపీ(BJP) కొత్త కమిటీలో అంతా హైదరాబాద్‌కు చెందిన నేతలే ఉన్నారని అన్నారు. ఈ కమిటీని రాంచందర్ రావు వేశారా.. కిషన్ రెడ్డి(Kishan Reddy) వేశారో తెలియడం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడున్న కమిటీతో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని రాజాసింగ్ అన్నారు. బీజేపీలో ఎప్పుడు తప్పులు జరిగినా మాట్లాడుతా.. వెనకడుగు వేయబోను అని చెప్పారు.






