ప్రభుత్వంపై MLA రాజాసింగ్ పాజిటివ్ కామెంట్స్

by Gantepaka Srikanth |

గణేష్ నిమజ్జనాల(Ganesh immersion)పై గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Raja Singh) కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రభుత్వంపై MLA రాజాసింగ్ పాజిటివ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: గణేష్ నిమజ్జనాల(Ganesh immersion)పై గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Raja Singh) కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘నగరంలో వినాయక నిమజ్జనం చాలా ప్రశాంగంగా పూర్తయింది. అన్ని శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేశారు. పోలీస్, మున్సిపల్, ట్రాఫిక్ శాఖలకు క్రెడిట్ ఇవ్వాలి. అయితే.. వినాయక సాగర్ మురికి నీటితో నిండిపోయింది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలి’ అని రాజాసింగ్ సూచించారు. కాగా, గ్రేటర్ వ్యాప్తంగా 3,03,585 విగ్రహాల నిమజ్జనం జరిగినట్లు జీహెచ్ఎంసీ ప్రకటించింది. ఇందులో మూడు అడుగుల లోపు 1,14,566 విగ్రహాలుండగా, అంతకు మించినవి 1,89,019 ఉన్నాయి. హుస్సేన్ సాగర్‌తో పాటు నగర వ్యాప్తంగా 20 చెరువులు, 74 ఆర్టిఫిషియల్​పాండ్స్‌లో నిమజ్జనం జరిగింది. ఇందులో హుస్సేన్ సాగర్‌లోనే 25 వేల వరకు విగ్రహాల నిమజ్జనం చేశారు. అందరి సహకారంలో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా, విజయవంతమైందని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి హర్షం వ్యక్తం చేశారు.

Next Story