- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Milad un Nabi: మిలాద్-ఉన్-నబీ ర్యాలీలో న్యూసెన్స్..! బాధ్యులపై చర్యలు తీసుకోండి : రాజాసింగ్
హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో మిలాద్-ఉన్-నబీ ర్యాలీని ఆదివారం నిర్వహించారని, కార్యక్రమం మంచిగా నిర్వహించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సూచించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ నగరంలో ముస్లిం సోదరులు ఘనంగా మిలాద్-ఉన్-నబీ ర్యాలీ నిర్వహించారు. ఇందుకు సంబంధించిన కమిటీ ఆధ్వర్యంలో ఒంటెలు, బైకులు, కార్లు, ఆటోలతో ముస్లింలు చార్మినార్ వద్దకు చేరుకున్నారు. మక్కా మసీదులో ప్రార్థనాల అనంతరం పాతబస్తీలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వందలాది ముస్లింలు, యువకులు పాల్గొన్నారు. దర్గాకు సంబంధించిన జెండాలు పట్టుకోని ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో విడుదల చేశారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో మిలాద్-ఉన్-నబీ (Milad un Nabi) ర్యాలీని ఆదివారం నిర్వహించారని, కార్యక్రమం మంచిగా నిర్వహించాలని రాజాసింగ్ (Raja Singh) సూచించారు. కానీ బస్సులు ఆపడం, అద్దాలు పగలగొట్టడం, రోడ్డు జామ్ చేయడంపై ఎవరు మీకు అధికారం ఇచ్చారని ర్యాలీలో పాల్గొన్న వారిని ప్రశ్నించారు. గతంలో నేను తిరంగా ర్యాలీ చేస్తే నా నియోజకవర్గంలోనే పోలీసులు నా పైన 4 కేసులు పెట్టారని గుర్తుకుచేశారు. ఇప్పుడు ఎంతమంది పై కేసులు పెడతారో చూద్దాం అని అన్నారు.
మిలాద్- ఉన్నబీ ర్యాలీలో ఎక్కడ చూసిన న్యూసెన్స్ చేస్తుంటే పోలీస్ వాళ్ళు పట్టించుకోరా..? రాజాసింగ్ ప్రశ్నించారు. ట్రాఫిక్ జామ్, బస్ అద్దాలు పగల కొడుతుంటే పోలీస్ వాళ్ళు పట్టించుకోరా..? అని ప్రశ్నించారు. వారు చేసే తమాషా పోలీసు అధికారులకు కనిపించడం లేదా..? అని నిలదీశారు. ఎవరైతే ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారో.. హింధులను ఎవరు టార్గెట్ చేశారో వాళ్ళని అరెస్ట్ చేయాలని పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేశారు.






