- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్‌లో చేరబోతున్నారంటూ వార్తలు.. స్పందించిన రాజాసింగ్
వెబ్‌డెస్క్: గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Raja Singh) బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Raja Singh) బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఆయన కాంగ్రెస్‌లోకి, బీఆర్ఎస్‌లోకి చేరబోతున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో విస్తృతమయ్యాయి. తాజాగా ఆ వార్తలపై రాజాసింగ్ స్పందించారు. మంగళవారం ఆయన మీడియా ఛానల్ ప్రతినిధులతో మాట్లాడారు. హిందూత్వ వ్యతిరేక పార్టీల్లో తాను చేరబోను అని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు హిందూత్వం మీద గౌరవం లేదని అన్నారు. తనకు మోడీ, అమిత్ షా, యోగిలకు పెద్ద అభిమానిని, వారి కోసం చివరి వరకూ పనిచేస్తా అని అన్నారు.
మరోవైపు.. తాను హిందుత్వ ఎజెండాతోనే ముందుకు వెళ్తానని చెప్పిన రాజాసింగ్ అదే ఎజెండా కలిగిన శివసేన పార్టీలో చేరతారని తెలుస్తోంది. ఆయన గతంలోనే శివసేనలో చేరతారని, నాందేడ్ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ప్రస్తుతం తెలంగాణలో శివసేన ఉన్నప్పటికీ ఉనికిలో లేదనే చెప్పాలి. దీంతో చరిష్మా ఉన్న లీడర్ వస్తే పార్టీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉంది. ఈ క్రమంలో బీజేపీకి రాజీనామా చేసిన రాజాసింగ్ అటువైపు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.






