బీజేపీకి రాజాసింగ్ రాజీనామా

by Muthe.Rajitha |   (  Updated:2025-06-30 11:01:44  IST  )

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.

బీజేపీకి రాజాసింగ్ రాజీనామా
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు రాజాసింగ్. కాగా నేడు జరిగిన బీజేపీ అధ్యక్ష పదవి ఎన్నికల్లో పోటీ చేయడానికి నాంపల్లి బీజేపీ కార్యాలయానికి రాజాసింగ్ భారీ మద్దతుదారులతో చేరుకున్నారు. అయితే తన అనుచరులను బెదిరించారని, తాను ఇక పార్టీలో ఉండలేనని రాజీనామా చేస్తున్నానని అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాకూడదని బీజేపీ పెద్దలు కోరుకుంటున్నారు.

అధ్యక్షుడు ఎవరో ముందుగానే డిసైడ్ చేశారు. 2019 నుంచి ఎన్నో కష్టాలు పడుతూ పార్టీకి సేవ చేస్తున్నాను అన్నారు. పార్టీకోసం తాను ఉగ్రవాదులకు శత్రువుగా మారానని, మీకో దండం, మీ పార్టీకి ఓ దండం అని రాజీనామా లేఖను కిషన్ రెడ్డికి పంపించారు. కాగా గత కొంతకాలంగా రాజాసింగ్ సొంత పార్టీ నేతలపై అసహనంతో ఉన్న సంగతి తెలిసిందే.

Next Story