జనసేనలో చేరికపై క్లారిటీ ఇచ్చిన రాజాసింగ్

by Gantepaka Srikanth |

గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన అసెంబ్లీ స్థానానికి ఎట్టి పరిస్థితుల్లో ఉప ఎన్నిక రాదని తేల్చి చెప్పారు. మూడేళ్లు ఎమ్మెల్యేగా ఉంటాననని స్పష్టం చేశారు.

జనసేనలో చేరికపై క్లారిటీ ఇచ్చిన రాజాసింగ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన అసెంబ్లీ స్థానానికి ఎట్టి పరిస్థితుల్లో ఉప ఎన్నిక రాదని తేల్చి చెప్పారు. మూడేళ్లు ఎమ్మెల్యేగా ఉంటాననని స్పష్టం చేశారు. ఉప ఎన్నిక జరుగుతుందని కొందరు రాజకీయ లబ్ధి కోసం ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. త్వరలో హస్తిన పెద్దల నుంచి తనకు పిలుపు వస్తుందని, అక్కడ తన బాధలు, కార్యకర్తల సమస్యలను వివరిస్తానని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీజేపీ అభ్యర్థి వ్యక్తిగతంగా పిలిస్తే వెళ్లి ప్రచారం చేస్తానని తెలిపారు. తమ పార్టీలో మిత్రులు, శత్రువులు ఉంటారని మీడియాకు తాను లీకులు ఇస్తున్నట్లు మా పార్టీ నేతలు డిల్లీ పెద్దలకు పిర్యాదు చేశారని వెల్లడించారు. ఇప్పటివరకు తాను బీజేపీ పార్టీకి మాత్రమే రాజీనామా చేశానని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదని కుండ బద్దలు కొట్టారు. బీజేపీ తన ఇల్లు, రాజాసింగ్ రా అంటే వెంటనే పార్టీలోకి వెళ్లిపోతానని పేర్కొన్నారు. కొందరు సోషల్ మీడియా ద్వారా అమిత్ షా, ప్రధాని మోడీ పోన్ చేశారని తప్పుడు ప్రచారం చేశారు.

పెన్ డ్రైవ్‌లో నా మీద ఫిర్యాదులు పంపించారని, సోషల్ మీడియా వార్తలతో నా రాజీనామాను పెద్దలు ఆమోదించారు. గోషామహల్లో ఉప ఎన్నిక రాదు. నేను పార్టీకి రాజీనామా చేశాను, ఎమ్మెల్యేగా రాజీనామా చేయలేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అక్కడ ఉప ఎన్నిక జరగకుండా ఇక్కడ ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. ఉప ఎన్నిక వస్తుందని కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పాత బట్టలు ఐరన్ చేసుకొని తిరుగుతున్నారు. కొందరు మా పార్టీ వాళ్లు కూడా తిరుగుతున్నారు. మూడేళ్లుఎమ్మెల్యేను నేనే. మా పెద్దవాళ్లు పిలిస్తే ఢిల్లీ వెళ్లి మాట్లాడుతాను. అన్ని విషయాలు పార్టీకి చెబుతాను. చాలా మంది పార్టీనీ ఎందుకు విడిచి వెళ్లారు, ఇతర పార్టీల నుండి వచ్చిన వారు అవమానాలు ఎందుకు భరిస్తున్నారు వంటి విషయాలు హైకమాండ్​వివరిస్తానని తెలిపారు. గతంలో 14 నెలలు బీజేపీ నుండి సస్పెండ్ అయ్యాను. నా శత్రువులు బీజేపీతో పాటు ఇతర పార్టీలో కూడా ఉన్నారు. నేను ఏ పార్టీలోకి వెళ్లినా ఆ పార్టీకి నష్టమే. టీడీపీ, శివసేన, జనసేన ఈ మూడు పార్టీలు మాతో జత కట్టే పార్టీలేనన్నారు. ధర్మ ప్రచారం, నియోజకవర్గం ప్రజలే ఈ రెండే నా ముందున్న అంశాలు. నా లాంటి వాళ్ళు వస్తారు పోతారని బీజేపీ ఉండాలి. తెలంగాణలో ఉన్న వారికి ఇప్పడు కాకున్న రేపు అయినా బుద్ధి వస్తుంది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Next Story