- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rain alert: మరో ఐదు రోజుల పాటు వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
by Ramesh Naini |
తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఐదు రోజుల పాటు ఎండలతో పాటు అకాల వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఐదు రోజుల పాటు ఎండలతో పాటు అకాల వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. వాతావరణంలో వస్తున్న మార్పుల నేపథ్యంలో మార్చి 31 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాలకు ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది. నిన్న రాత్రి హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురవగా.. రానున్న 48 గంటల్లో నగరంలో మోస్తరు నుంచి భారీ వానలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మరోవైపు, ఏప్రిల్ 3వ తేదీ నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
Next Story






