HYD: మళ్లీ మొదలైన వర్షం.. ఆ ప్రాంతంలో రాకపోకలు బంద్ చేసిన పోలీసులు

by Gantepaka Srikanth |   (  Updated:2025-08-08 17:16:58  IST  )

గ్రేటర్ హైదరాబాద్(Hyderabad) వ్యాప్తంగా మళ్లీ వర్షం(Rain) దంచికొడుతోంది.

HYD: మళ్లీ మొదలైన వర్షం.. ఆ ప్రాంతంలో రాకపోకలు బంద్ చేసిన పోలీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్(Hyderabad) వ్యాప్తంగా మళ్లీ వర్షం(Rain) దంచికొడుతోంది. పాతబస్తీ, చార్మినార్, చాంద్రయణగుట్ట, బహదూర్‌పుర, గౌలిపురా, శాలిబండ, సైదాబాద్, మలక్‌పేట్, చాదర్‌ఘాట్, బండ్లగూడ, నాంపల్లి, అంబర్‌పేట్, ఎల్బీనగర్ సహా పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. దీంతో రోడ్లపైకి భారీగా వరదనీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు హిమాయత్ సాగర్(Himayat Sagar) నీటిమట్టం భారీగా పెరిగింది. దీంతో హిమాయత్ సాగర్ ప్రాంతంలో పోలీసులు రాకపోకలు నిలిపివేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు హైదరాబాద్‌లో వర్షాలపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. అన్ని విభాగాల అధికారులను అప్రమత్తం చేశారు. వరద నీటి సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Next Story