- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rain alert: రాష్ట్రంలో వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ
వేసవి ప్రారంభానికి ముందు నుంచే ఎండలు దంచికొడుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: వేసవి (Summer) ప్రారంభానికి ముందు నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో (Telugu states) రోజు రోజుకు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భానుడి ఉగ్రరూపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ (HMD) చల్లని కబురు అందించింది. రాష్ట్రంలో రానున్న రెండు రోజుల పాటు తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు (Rains) కురుస్తాయిని తెలిపింది. అయితే, ఆయా జిల్లాల్లో వడగండ్ల వర్షం కురిసే అవకాశముందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. అలాగే, గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు, వడగండ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఈ మేరకు రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వాతావరణ అధికారులు సూచించారు. ఇక గురువారం మేడ్చల్, హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి ఆయా జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి.






