రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

by Yella Dhawani Reddy |

బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో తెలంగాణలో రానున్న రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.

రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు
X

దిశ, వెబ్ డెస్క్: బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో తెలంగాణలో (Telangana) రానున్న రెండు రోజులు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు (Rains) పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశం మేఘావృతమై ఉంటుందని, గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఇవాళ హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, యాదాద్రి, వరంగల్, మహబూబ్‌నగర్, ఆసిఫాబాద్, రంగారెడ్డి జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే, శనివారం పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వానలు కురుస్తాయని వెల్లడించింది. ఇక, ప్రస్తుతం అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం రాబోయే రెండు రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో పాటు ఆగస్టు 2 నాటికి అండమాన్ నికోబార్ దీవులకు పశ్చిమంగా మరో అల్పపీడనం ఏర్పడనుందని, అది కూడా బలపడితే.. ఆగస్టు 5 తర్వాత తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Next Story