- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రానున్న రెండు రోజులు పాటు వర్షాలు.. 18 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్
గత కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: గత కొన్ని రోజులుగా తెలంగాణ (Telangana) వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ శాఖ (Hyderabad Meteorological Department) ప్రజలకు చల్లటి వార్తను అందించింది. నైరుతి ఋతుపవనాలు (Southwest monsoon) వేగంగా కదులుతున్నాయి. అలాగే, ఉత్తర, దక్షిణ ద్రోణి ప్రభావంతో పాటు ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసరాల్లో సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల చక్రవాక ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు (Rains) కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది.
ఇక ఇవాళ నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. అలాగే, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో వీస్తాయని తెలిపింది. ఇక ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.






