- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ‘వరుణ’ గండం.. రేపు ఈ జిల్లాల్లో వర్షం పడే ఛాన్స్..!
గురువారం జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. రేపు రాష్ట్రంలో పలు చోట్ల వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావారణ శాఖ అధికారులు

దిశ, వెబ్‌డెస్క్: గురువారం జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. రేపు రాష్ట్రంలో పలు చోట్ల వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావారణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా బలపడనుంది. ఈ వాయుగుండం బంగాళాఖాతంలో వాయవ్య దిశగా పయనించి 48 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ తుపాన్ ప్రభావం వలన రాష్ట్ర వ్యాప్తంగా రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి సంగారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ జిల్లాల్లో వర్షం కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించారు. కాగా, పోలింగ్ వేళ వర్షం కురిస్తే ఓటర్లు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈ ప్రభావం పోలింగ్ శాతంపై ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంటుంది. కాగా, రేపు ఉదయం 7 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలు కానుంది.






