- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం
by GSrikanth |
గత కొన్ని రోజులుగా భారీ ఎండలతో సతమతం అవుతున్న హైదరాబాద్ నగర ప్రజలకు ఆదివారం సాయంత్రం కురిసిన వర్షం ఉపశమనం కలిగించింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: గత కొన్ని రోజులుగా భారీ ఎండలతో సతమతం అవుతున్న హైదరాబాద్ నగర ప్రజలకు ఆదివారం సాయంత్రం కురిసిన వర్షం ఉపశమనం కలిగించింది. గచ్చిబౌలి, కూకట్ పల్లి సుచిత్ర, కొంపల్లి, మణికొండ ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. కొన్నిచోట్ల రహదారులపై వర్షం నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు తెలంగాణలో రాబోయే మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. విదర్భ నుంచి మరఠ్వాడ, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతోందని తెలిపింది. రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు పగటి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల నుంచి 44 డిగ్రీల వరకు నమోదయ్యే ఛాన్స్ ఉందని పేర్కొంది.
Next Story






