- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్‌లో వర్షం.. ఆ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం (జూన్ 25) మధ్యాహ్నం వర్షం కురిసింది.

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ (Hyderabad) నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం (జూన్ 25) మధ్యాహ్నం వర్షం (Rain) కురిసింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండటంతో పాటు వాతావరణం చల్లబడి ఒక్కసారిగా వర్షం కురిసింది. గత కొద్ది రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం చల్లదనంగానే ఉంటుంది. కొంత సేపు ఎండలు కొట్టినా.. మిగితా సమయం మబ్బులు కమ్ముకుంటున్నాయి. పలు జిల్లాల్లో చిరుజల్లులు కూడా కురుస్తున్నాయి. ఈ క్రమంలో సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, బేగంపేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్‌సిటీ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో వర్షం నీరు రోడ్లపై నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. పలుచోట్ల ట్రాఫిక్‌కు (Traffic) అంతరాయం ఏర్పడింది.
కాగా, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో గురువారం (జూన్ 26) ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ (Hyderabad Meteorological Department) తెలిపింది. అలాగే గంటలకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఉపరితల గాలులు ఉత్తర దిశగా గంటకు 6-10 కిలోమీరట్ల వేగంతో వీస్తాయంది. ఈ మేరకు ఆ ప్రాంతాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.






