Rain Alert: రానున్న 3 రోజుల పాటు రాష్ట్రానికి వర్ష సూచన

by Yella Dhawani Reddy |

తెలంగాణ రాష్ట్ర ప్రజలు హైదరాబాద్ వాతావరణ శాఖ (Hyderabad Department of Meteorology) అలర్ట్ జారీ చేసింది.

Rain Alert: రానున్న 3 రోజుల పాటు రాష్ట్రానికి వర్ష సూచన
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రజలు హైదరాబాద్ వాతావరణ శాఖ (Hyderabad Department of Meteorology) అలర్ట్ జారీ చేసింది. నైరుతి రుతుపవనాల విస్తరణ, బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో నేటి నుంచి రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు (Rains) కురిసే అవకాశం ఉందని తెలిపింది. 16 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈ ప్రభావం మరింతగా కనిపించే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఇక శనివారం ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి వంటి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఉరుములు, మెరుపులు అధికంగా ఉండే సమయంలో చెట్ల కింద ఉండకూడదని, ఎత్తైన ప్రాంతాల్లో నిలబడకూడదని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. అలాగే, విద్యుత్ స్తంభాలు, కంచె లాంటి వాటి నుంచి దూరంగా ఉండాలన్నారు. ఎటువంటి అత్యవసర పరిస్థితి ఎదురైతే, స్థానిక అధికారులను సంప్రదించాలని తెలిపారు.

Next Story