బిగ్ అలర్ట్ : మరో మూడు రోజులు దంచి కొట్టనున్న వర్షాలు

by Dishanational2 |
బిగ్ అలర్ట్ : మరో మూడు రోజులు దంచి కొట్టనున్న వర్షాలు
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ రైతులకు బిగ్ అలర్ట్. ఇప్పటికే రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అకాల వర్షాలతో రైతన్నలు పంట నష్టపోయి, కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది.

రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురువనున్నాయని తెలిపింది. బుధ, గురు, శుక్రవారాల్లో చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ మంగళవారం ఒక ప్రకటనలో సూచించింది.

Also Read: అకాల వర్షాలతో చిరు వ్యాపారుల విలవిల



Next Story