తెలంగాణకు చల్లటి కబురు.. నేడు రేపు భారీ వర్ష సూచన

by Dishanational2 |
తెలంగాణకు చల్లటి కబురు.. నేడు రేపు భారీ వర్ష సూచన
X

దిశ, వెబ్‌డెస్క్ : భానుడి భగ భగలకు చుక్కలు చూస్తున్న తెలంగాణ ప్రజలకు చల్లటి కబురు అందింది. గత నెల రోజుల నుంచి రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉక్కపోత, మండుటెండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నేడు రేపు, అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. అలాగే గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఇక వాతావరణశాఖ కబురుతో రాష్ట్రప్రజలు ఆనందంలో మునిగితేలుతున్నారు.



Next Story

Most Viewed