weather update : తెలంగాణకు వర్ష సూచన.. మరో 2 గంటల్లో ఈ జిల్లాల్లో వర్షాలు

by Ajay Maddhiboyina |   (  Updated:2026-05-11 12:08:12  IST  )

తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో దాదాపు 40 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే 15 రోజుల్లో తెలంగాణ‌లో ఉష్ణోగ్ర‌త‌లు మ‌రింత పెరుగుతాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ అంచ‌నా వేస్తోంది.

weather update : తెలంగాణకు వర్ష సూచన.. మరో 2 గంటల్లో ఈ జిల్లాల్లో వర్షాలు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో దాదాపు 40 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే 15 రోజుల్లో తెలంగాణ‌లో ఉష్ణోగ్ర‌త‌లు మ‌రింత పెరుగుతాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ అంచ‌నా వేస్తోంది. ప‌లు ప్రాంతాల్లో 45 నుండి 48 డిగ్రీల వ‌ర‌కు ఉష్ణోగ్ర‌తలు పెర‌గ‌డంతో పాటు భారీ వ‌డ‌గాలులు వీస్తాయ‌ని చెబుతోంది. ఉత్త‌ర‌, తూర్పు తెలంగాణ‌లో మే 16 నుండి 20 తేదీల మ‌ధ్య 45 డిగ్రీల నుండి 47డిగ్రీల వ‌ర‌కు ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతాయ‌ని మ‌రో 15 రోజుల్లో వేస‌వి తీవ్ర‌త మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేస్తోంది. మరోవైపు వారం రోజుల నుండి రాష్ట్రంలో అప్పుడప్పుడు వర్షాలు సైతం కురుస్తున్నాయి.

ఇక ఈ రోజు కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ బాలాజీ పేర్కొన్నారు. మరో రెండు గంటల్లో వికారాబాద్, నారాయణ్ పేట్, మహబూబ్ నగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. మిగితా జిల్లాల్లో పొడి వాతావరణం ఉంటుందని స్పష్టం చేశారు. అయితే వ‌ర్షం కార‌ణంగా వాతావ‌ర‌ణం కాస్త చ‌ల్ల‌బ‌డుతున్నా మిగితా స‌మ‌యంలో ఎండ‌తో ప్ర‌జ‌లు అల్లాడిపోతున్నారు. అంతేకాకుండా ప్ర‌స్తుతం కురుస్తున్న వ‌ర్షాల వ‌ల్ల క‌ల్లాల్లో ఆర‌బెట్టి వ‌రి ధాన్యం త‌డిచిపోవ‌డంతో రైతులు ఇబ్బందిప‌డుతున్నారు. కొన్నిసార్లు వ‌ర్షంతో పాటు గాలి దుమారాలు చెల‌రేగ‌డంతో ఇత‌ర పంట‌లు కూడా డ్యామేజ్ అవుతున్నాయి.

Next Story