- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాలకు భారీ వర్షసూచన
రాష్ట్రంలో ఈరోజు కూడా భారీ వర్షాలు కురిసే అవాకాశం ఉందని వెదర్ మ్యాన్ బాలాజీ పేర్కొన్నారు. సౌత్, సెంట్రల్, ఈస్ట్ తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అంచనా వేశారు.

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఈరోజు కూడా భారీ వర్షాలు కురిసే అవాకాశం ఉందని వెదర్ మ్యాన్ బాలాజీ పేర్కొన్నారు. సౌత్, సెంట్రల్, ఈస్ట్ తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అంచనా వేశారు. మధ్యాహ్నం వరకు అన్ని జిల్లాల్లో వేడి, ఉక్కపోతతో 41 నుండి 43 డిగ్రీల వరకు ఊష్ణోగ్రతలు ఉంటాయని వెల్లించారు. కానీ తరవాత వాతావరణంలో మార్పులు వస్తాయని రంగారెడ్డి, నల్గొండ, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, జనగాం, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, సిద్దిపేట్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో మధ్యాహ్నం తరవాత రాత్రి వరకు ఏ సమయంలో అయినా వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పారు.
హైదరాబాద్ లో సాయంత్రం వరకు పొడి వాతావరణమే ఉంటుందని, కానీ రాత్రి సమయంలో వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. మంగళవారం మాదిరిగానే రాష్టంలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అంచనా వేశారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మంగళవారం వర్షం దంచికొట్టింది. హైదరాబాద్ లో కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ సమస్యలు తలెత్తాయ. గంటల తరబడి వాహనదారులు ట్రాఫిక్ లో చిక్కుకోవాల్సి వచ్చింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ వర్షంతో రాష్ట్రంలో వర్షాకాలం ఎంట్రీ ఇచ్చిందనే భావన కూడా ప్రజల్లో ఏర్పడింది.






