స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 9కి చేరిన మృతుల సంఖ్య

by Ajay Maddhiboyina |

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్ర‌మాదంలో మృతుల సంఖ్య 9కి చేరుకుంది. ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన పైడి రాజు అనే కార్మికుడు సెవెన్ హిల్స్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ క‌న్నుమూశాడు. ప్ర‌మాదం జ‌రిగిన త‌ర‌వాత పైడి రాజు త‌న కుటుంబ స‌భ్యుల కోసం ఓ వీడియో చేశాడు.

స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 9కి చేరిన మృతుల సంఖ్య
X

దిశ‌, వెబ్ డెస్క్: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్ర‌మాదంలో మృతుల సంఖ్య 9కి చేరుకుంది. ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన పైడి రాజు అనే కార్మికుడు సెవెన్ హిల్స్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ క‌న్నుమూశాడు. ప్ర‌మాదం జ‌రిగిన త‌ర‌వాత పైడి రాజు త‌న కుటుంబ స‌భ్యుల కోసం ఓ వీడియో చేశాడు. ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తున్న స‌మ‌యంలో స్ట్రెచ్చ‌ర్ పై ప‌డుకోబెట్టిన స‌మ‌యంలో తోటి వ్య‌క్తి చేత పైడి రాజు అడిగి మ‌రీ వీడియో తీయించాడు. వ‌ర్మ‌.. త‌మ్ముడిపై కోప్ప‌డ‌కు, త‌మ్ముడిని బాగా చ‌దివించు. నువ్వు కూడా బాగా చ‌దువుకో. అమ్మ‌ని బాగా చూసుకోండి డాడీ.. ఇక ఉంటాను. అంటూ సందేశం ఇచ్చాడు.

కాగా చికిత్స పొందుతూ బుధ‌వారం తెల్ల‌వారుజామున ఆయ‌న క‌న్నుమూశాడు. పైడి రాజు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అది చూసిన ప్రతి ఒక్కరూ చలించిపోయారు. చావుబతుకుల్లోనూ భర్త తన భార్య కోసం, తన పిల్లల కోసం పడిన ఆరాటం చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్ర‌మాదం పైడి రాజు కుటుంబంలోనే కాకుండా మ‌రో ఎనిమిది మంది జీవితాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. మ‌రో ఐదుగురు కొన ఊపిరితో ప్రాణాల‌తో పోరాడుతున్నారు. ప్ర‌భుత్వం ఇప్ప‌టికే మృతుల కుంబాల‌కు ఎక్స్ గ్రేషియా ప్ర‌క‌టించ‌డంతో పాటు వారి కుటంబాల‌కు అండ‌గా ఉంటామ‌ని హామీ ఇచ్చింది.

Next Story