- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణకు చల్లని కబురు.. మరో 2గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షం
మండే ఎండలతో తల్లడిల్లిపోతున్న రాష్ట్ర ప్రజలకు వెదర్ మ్యాన్ బాలాజీ చల్లని కబురు చెప్పారు. మరో రెండు గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.

దిశ, వెబ్ డెస్క్: మండే ఎండలతో తల్లడిల్లిపోతున్న రాష్ట్ర ప్రజలకు వెదర్ మ్యాన్ బాలాజీ చల్లని కబురు చెప్పారు. మరో రెండు గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. మంచిర్యాల, ఆదిలాబాద్, కొమురంభీం అసిఫాబాద్, నిర్మల్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో మరో రెండు గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. అదే విధంగా యాదాద్రి భువనగిరి, నల్గొండ, మేడ్చల్, యాచారం, సూర్యాపేటలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే ఛాన్స్ ఉందన్నారు. మరోవైపు భూపాలపల్లి, మెదక్, కామారెడ్డి, ఖమ్మం, వికారాబాద్ జిల్లాల్లో చిరుజల్లులు కురిసే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్ లో దాదాపు పొడి వాతావరణం ఉంటుందని, రాత్రి సమయంలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇక గత వారం రోజుల నుండి తెలంగాణలో ఎండలు మండిపోతున్న సంగతి తెలిసిందే. ఎండల కారణంగా ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. దాదాపు అన్ని జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చాలా మంది వడదెబ్బతో మరణిస్తున్నారు. ఇలాంటి సమయంలో వర్షం కురిస్తే వేడి నుండి ఉపశమనం కలిగే అవకాశం ఉంది.






