తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షం

by Ajay Maddhiboyina |   (  Updated:2026-05-05 15:54:56  IST  )

వెదర్ మ్యాన్ బాలాజీ చల్లని వార్త వినిపించారు. మరో రెండు గంటల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షం
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 6 గంటలు దాటిందంటే చాలు ఎండ మొదలై సాయంత్రం 6గంటల వరకు దంచికొడుతోంది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోయాయి. మే ప్రారంభం నుండే ఈ స్థాయిలో ఎండలు కొడుతుండటంతో ప్రజలు భయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఇలాంటి సమయంలో వెదర్ మ్యాన్ బాలాజీ చల్లని వార్త వినిపించారు. మరో రెండు గంటల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

కొమురంభీం అసిఫాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి, మంచిర్యాల జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని తెలిపారు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో సైతం తేలికపాటి నుండి మధ్యస్థంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. నగరంలోని శేర్లింగంపల్లి, కూకట్ పల్లి, మియాపూర్, మెదక్, నిజాంపేట్, మాదాపూర్, మణికొండ, షేక్ పేట్, టోలిచౌకి, కార్వాన్, రాజేంద్రనగర్, గోల్కొండ, చార్మినార్, చాంద్రాయనగుట్ట, అత్తాపూర్, ఆసిఫ్ నగర్, కాలేదాన్, శంషాబాద్ ప్రాంతాల్లో వర్షం కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. ఎండల వేడితో, ఉక్కపోతతో తల్లడిల్లిపోతున్న ప్రజలకు వర్షసూచన చల్లనికబురు అనే చెప్పాలి.

Next Story