- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణకు రెయిన్ అలర్ట్.. మరో 2గంటల్లో ఈ జిల్లాల్లో వర్షం
నేడు కూడా రాష్ట్రానికి వర్షసూచన ఉన్నట్టు ఇప్పటికే వాతావరణశాఖ ప్రకటించింది. మరో 2 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో సోమవారం వాతావరణం పూర్తిగా మారిపోయిన సంగతి తెలిసిందే. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. కాగా నేడు కూడా రాష్ట్రానికి వర్షసూచన ఉన్నట్టు ఇప్పటికే వాతావరణశాఖ ప్రకటించింది. మరో 2 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కామారెడ్డి, సిరిసిల్ల, మెదక్ జిల్లాల్లో మరో రెండు గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఇక హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల్లో మరో మూడు గంటల వరకు పొడి వాతావరణమే ఉంటుందని పేర్కొంది.
మరోవైపు నిన్న పలు జిల్లాల్లో భారీ వర్షాపాతం నమోదైంది. అత్యధికంగా నల్గొండ జిల్లా చందంపేటలో 70 మి.మీ వర్షాపాతం నమోదైంది. రంగారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. అంతే కాకుండా హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం కురవగా దక్షిణ హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిశాయి. నగరంలో అత్యధికంగా బహదూర్ పురాలో 42.8మి.మీ వర్షాపాతం నమోదైంది.






