- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాదీలకు అలర్ట్.. మరో గంటలో ఈ ప్రాంతాల్లో వర్షం
మరో గంటలో హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ బాలాజీ పేర్కొన్నారు. తేలికపాటి నుండి మధ్యస్థంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపాడు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో సోమవారం నుండి వాతావరణంలో మార్పులు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పలు జిల్లాల్లో తేలికపాటి నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు కూడా మధ్యాహ్నం పలు జిల్లాల్లో వర్షం కురిసింది. కాగా మరో గంటలో హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ బాలాజీ పేర్కొన్నారు. తేలికపాటి నుండి మధ్యస్థంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపాడు. ముఖ్యంగా బీహెచ్ఈఎల్, లింగంపల్లి, ఆర్‌సీపురం, పటాన్ చెరు, బాచుపల్లి, నిజాంపేట్, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్, కుత్ బుల్లాపూర్ ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపాడు. ఆ తరవాత వర్షం మాదాపూర్, హైటెక్ సిటీ, షేక్ పేట్, జూబ్లిహిల్స్ ప్రాంతాలకు సైతం విస్తరించే అవకాశం ఉందని పేర్కొన్నాడు. ఇక వర్షసూచన నేపథ్యంలో నగరవాసులు అలర్ట్‌గా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయంలో బయటకు వెళ్లకపోవడమే మంచిది.






