- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాదీలకు అలర్ట్.. మరో 2గంటల్లో ఈ ప్రాంతాల్లో భారీ వర్షం
హైదరాబాద్‌లో నేడు వాతావరణం భిన్నంగా ఉంది. ఉదయం నుండి ఎండలు మండిపోవడంతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో నేడు వాతావరణం భిన్నంగా ఉంది. ఉదయం నుండి ఎండలు మండిపోవడంతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఇక సాయంత్రం పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మియాపూర్, మల్లాపూర్, హఫీజ్‌పేట్, సరూర్‌నగర్, కార్వాన్, చాంద్రాయణగుట్ట, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, సైదాబాద్, బండ్లగూడలో భారీ వర్షం కురింసింది.
దీంతో రోడ్లపై భారీగా వరద నీరు నిలిచిపోయింది. ఇక మరో ఒకటి నుండి రెండు గంటల్లో పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ రిపోర్ట్ ఇచ్చారు. షెయిక్ పేట్, మాదాపూర్, కూకట్ పల్లి, హైటెక్ సిటీ, రాయదుర్గ, గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్, ఆర్సీపురం, షేర్ లింగంపల్లి, పటాన్‌చెరు, కుత్బుల్లాపూర్, గాజులరామారం, బాలనగర్, సుచిత్ర, జీడిమెట్లలో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపాడు. కాబట్టి నగరవాసులు జాగ్రత్తగా ఉండాలని సూచించాడు.






