- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
RAIN ALERT : వాతావరణ శాఖ బిగ్ అలర్ట్.. తెలంగాణలోని ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
by Sathputhe Rajesh |
గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి రాష్ట్రం తడిసి ముద్దయింది.

X
దిశ, వెబ్‌డెస్క్ : గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి రాష్ట్రం తడిసి ముద్దయింది. దీంతో స్టేట్ వైడ్‌గా వాతావరణం ఒక్క సారిగా చల్లబడింది. అయితే తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొమురం భీం ఆసిఫాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులో కూడిన వర్షాలు కురిసే చాన్స్ ఉన్నట్లు తెలిపింది. మరో వైపు నాలుగు రోజులుగా ముసురు ఉండటంతో రాష్ట్రంలోని అన్ని చోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్లు చెరువులు మత్తడి దూకుతున్నాయి. ఏపీతో పాటు మహారాష్ట్రలోని ముంబైలో సైతం వర్షాలు కురుస్తున్నాయి. మంబై, పూణేలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.
Next Story






