- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rain Alert:రాష్ట్ర ప్రజలకు రెయిన్ అలర్ట్.. మూడు రోజులు వర్షాలు
తెలుగు రాష్ట్రాలను వర్షాలు(Rains) వీడడం లేదు.

దిశ,వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాలను వర్షాలు(Rains) వీడడం లేదు. ఈ క్రమంలో తాజాగా వాతావరణ శాఖ మరోసారి తెలంగాణ ప్రజలకు రెయిన్ అలర్ట్(Rain Alert) జారీ చేసింది. రాష్ట్రంలో రానున్న మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్(Hyderabad) వాతావరణ శాఖ(Department of Meteorology) తెలిపింది. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించింది. వచ్చే వారం రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండబోదని వెల్లడించింది. రాష్ట్రంలోకి కింది స్థాయి గాలులు ప్రధానంగా తూర్పు, ఆగ్నేయం దిశల నుంచి వీస్తున్నట్లు పేర్కొంది. ఈక్రమంలో ఆదిలాబాద్, వికారాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కొమురంభీం, మహబూబ్‌నగర్, మంచిర్యాల, మెదక్, నాగర్‌కర్నూల్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక పంట కోతకు వచ్చిన సమయంలో వాతావరణ శాఖ వర్షాలపై ప్రకటన చేయడం రైతులలో ఆందోళన కలిగిస్తోంది.






