TG Rain Alert:రాష్ట్ర ప్రజలకు రెయిన్ అలర్ట్.. రానున్న మూడు రోజులు ఉరుములతో కూడిన వర్షాలు

by Jakkula.Mamatha |

రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి

TG Rain Alert:రాష్ట్ర ప్రజలకు రెయిన్ అలర్ట్.. రానున్న మూడు రోజులు ఉరుములతో కూడిన వర్షాలు
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. పగలంతా ఎండలు దంచికొడుతుంటే, సాయంత్రం కాగానే ఒక్కసారిగా వాతావరణం(Weather) చల్లబడి ఉరుములు, మెరుపులతో వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ(Telangana) ప్రజలకు వాతావరణ శాఖ(Department of Meteorology) మరోసారి హెచ్చరికలు జారీ చేసింది.

రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని హైదరాబాద్(Hyderabad) వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ తరుణంలో రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు చ‌ల్ల‌టి క‌బురు అందింది. తెలంగాణలోని ప‌లు జిల్లాల్లో మూడు రోజులు తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉందని వాతావరణ శాఖ వెల్ల‌డించింది. ఈ క్రమంలో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పిడుగులు పడే ఛాన్స్ ఉందని తెలిపింది.

ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మూడు రోజులు గంట‌కు 40 నుంచి 50 కిలోమీట‌ర్ల వేగంతో ఈదురు గాలుల‌తో కూడిన వ‌ర్షాలు ప‌డ‌తాయ‌ని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే వాతావరణంలో నెలకొంటున్న భిన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

Next Story