- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లో మళ్లీ దంచికొడుతున్న వర్షం.. మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు అప్రమత్తం
గ్రేటర్ హైదరాబాద్(Greater Hyderabad) వ్యాప్తంగా వర్షం(Heavy Rain) మళ్లీ దంచికొడుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్(Greater Hyderabad) వ్యాప్తంగా వర్షం(Heavy Rain) మళ్లీ దంచికొడుతోంది. ఆల్వాల్, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, యూసఫ్‌గూడ, ఫిల్మ్‌నగర్, మాదాపూర్, సరూర్‌నగర్, మారేడ్‌పల్లి, ఉప్పల్, నాంపల్లి, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, లక్డీకపూల్, ఖైరతాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. దీంతో మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు(Monsoon Emergency Teams) అప్రమత్తమయ్యాయి. కాగా, ఇప్పటికే నగరంలో భారీ వర్షాల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అన్ని విభాగాలు సమన్వయంతో ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలన్నారు. నీళ్లు నిలిచిన, ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడిన చోట్ల పోలీస్, ట్రాఫిక్, హైడ్రా విభాగాలు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. లోతట్టు ప్రాంతాలు, నాలాలున్న చోట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన హైడ్రా, డీఆర్‌ఎఫ్‌లు స్థానికులకు సహాయం చేయడానికి హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేశాయి. సహాయం కోసం 040 29560521, 9000113667, 9154170992 ఈ నెంబర్లకు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు.






