నేడు ఈ జిల్లాల్లో పిడుగుల‌తో కూడిన‌ వ‌ర్షాలు...ఎల్లో అల‌ర్ట్ జారీ

by velandi.Saikiran |

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ కూడా విస్తారంగా వర్షాలు ప‌డ‌నున్నాయి.

నేడు ఈ జిల్లాల్లో పిడుగుల‌తో కూడిన‌ వ‌ర్షాలు...ఎల్లో అల‌ర్ట్ జారీ
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ కూడా విస్తారంగా వర్షాలు ప‌డ‌నున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిర్మల్, ములుగు, భద్రాద్రి, ఆసిఫాబాద్, సూర్యపేట, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, సిరిసిల్ల, రంగారెడ్డి, మెదక్ జిల్లాలలో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

పలు చోట్ల పిడుగులు పడే ఆస్కారం ఉందని కూడా వెల్లడించింది. ఈ క్రమంలో ఆయా ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వర్షాలు పడనున్నట్లు అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. నేడు కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ప‌డ‌నున్నాయి. అటు రాయలసీమ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్ల‌డించింది. ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపిస్తే వెంటనే..చెట్ల కింద, పోల్స్ దగ్గర ఉండకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు అధికారులు.

Next Story