- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రష్మిక 'మైసా' నుంచి సూపర్ అప్‌డేట్ వచ్చేసింది
'మైసా' షూటింగ్ స్పాట్ నుంచి రష్మిక పంచుకున్న ఫొటో సినిమాపై ఆసక్తిని పెంచింది.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ బ్యూటీ రష్మిక మందన్న ప్రస్తుతం 'మైసా' చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. తాజాగా రష్మిక షూటింగ్ స్పాట్ నుంచి ఓ ప్రత్యేక ఫొటోను సోషల్ మీడియాలో పంచుకుంది. దానికి "రక్తపు గుర్తులు కూడా దారిలోనే ఉన్నాయి" అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్ ఇవ్వడంతో సినిమాపై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. ఈ చిత్రంలో రష్మిక ఇప్పటివరకు కనిపించని విధంగా ఓ పవర్‌ఫుల్ మాస్ పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రం విజయాన్ని అందుకుంటే రష్మిక క్రేజ్ మరో స్థాయికి చేరుకుంటుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్‌ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్‌పై అజయ్ సాయిపురెడ్డి, అనిల్ సాయిపురెడ్డి నిర్మిస్తున్నారు. గురు సోమసుందరం, ఈశ్వరి రావు, తారక్ పొన్నప్ప, నిధి సింగ్ కీలక పాత్రలు పోషిస్తుండగా, జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో భారీగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.






