- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జులై 1 నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సీఎం పర్యటనలు.. షెడ్యూల్ ఇదే
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జులై 1 నుంచి 5వ తేదీ వరకూ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వరుసగా పర్యటించనున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జులై 1 నుంచి 5వ తేదీ వరకూ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వరుసగా పర్యటించనున్నారు. ఈ పర్యటనల్లో భాగంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. జులై 1న ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేయనున్నారు. అనంతరం నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలో పర్యటించనున్నారు. అదేరోజున తిరుపతి శ్రీసిటీలో హీరో మోటో కార్ప్ రూ.750 కోట్లతో ఏర్పాటు చేయనున్న గ్లోబల్ పార్ట్స్ సెంటర్ కు శంకుస్థాపన చేస్తారు.
జులై2వ తేదీ ఉదయం తిరుపతి జిల్లా రైల్వేకోడూరులో వీబీ జీ రామ్ జీ పథకం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం తిరుపతిలో జరిగే జీఎస్ డీపీ కెపాసిటీ బిల్డింగ్ వర్క్ షాపునకు హాజరవుతారు. ఇందులో నీతి ఆయోగ్ సభ్యులు, పీఎం ఆర్థిక సలహా మండలి సభ్యులు పాల్గొననున్నారు. 3వ తేదీ ఉదయం కడప జిల్లా జమ్మల మడుగు నియోజకవర్గం సున్నపురాళ్లపల్లెలో రాయలసీమ ఉక్కు కర్మాగారం పనులను ప్రారంభిస్తారు. అనంతరం చిత్తూరు జిల్లా కుప్పం చేరుకుంటారు. అప్పటి నుంచి 5వ తేదీ వరకూ ఆయన కుప్పంటోనే పర్యటించి.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు.






